దేవాదుల ఫేస్ -3 పంప్ హౌస్ మోటార్లు ప్రారంభం

by Sridhar Babu |   ( Updated:2025-03-18 13:21:04.0  )
దేవాదుల ఫేస్ -3  పంప్ హౌస్ మోటార్లు ప్రారంభం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లంలోని దేవ‌న్న‌పేట గ్రామంలో దేవాదుల ఫేస్ 3 ప్యాకేజీ పంప్ హౌస్ మోటార్లను మంగ‌ళ‌వారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, తదితరులతో హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరుకోగా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరుకోగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జి డబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, దేవాదుల అధికారులు పుష్పగుచ్ఛాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు.

Next Story

Most Viewed