'తెలంగాణ దొరల గడిలో బందీ'.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కోదండరాం ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-06-13 15:17:14.0  )
తెలంగాణ దొరల గడిలో బందీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కోదండరాం ఫైర్
X

దిశ, ఐనవోలు (వర్థన్నపేట): మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో 'తెలంగాణ బచావో' సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అందే శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సాధించిన తెలంగాణ దొరల గడిలో బందీ అయినది. తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు, నీళ్లు వస్తాయని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు, తెలంగాణ వచ్చింది నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి పరిమితమైనదని కోదండరాం బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆరోజు మేమందరం ఉద్యమ పోరాటంలో అనుకున్నాం.. తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేయాలి, తెలంగాణ వచ్చినాక కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని ఊహించినట్టుగానే ఈరోజు అదే జరుగుతున్నదన్నారు.


ప్రజలు ముఖ్యమంత్రిని కలవకుండా తన ఇంటి చుట్టూ కంచె వేసుకున్నారు. ముఖ్యమంత్రి ఒక నిజాం రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారని.. ఈ ముఖ్యమంత్రి ప్రజలు కలవడానికి వెళ్లిన వారిని కలవరన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఇసుక కాంట్రాక్టర్, భూకబ్జాలు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడుని ఫైరయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ జన సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా వడ్డేపల్లి విజయ్ కుమార్ ను ప్రకటించారు. రానున్న రోజుల్లో మా అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించండి ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో అందెశ్రీ మాట్లాడుతూ.. మనమందరం 60 సంవత్సరాలు నిండిన తర్వాత షష్టిపూర్తి చేసుకోవడం చూసాము కానీ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెరువుల కట్టమీద చికెన్ మటన్ మందుతో దావతులు ధూమ్ దాం చేసుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడా చూడలేదు మన ఓట్లను కొల్లగొట్టడానికి మందు, మటన్ చికెన్ తో ఓటర్లకు ఏర వేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.


అధికార పార్టీపై ప్రతి వ్యక్తి కన్ను తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఓటర్ ఒక షూటర్ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డేపల్లి విజయ్ కుమార్, సమావేశ కర్త వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలిశాల రాజేష్, జిల్లా అధ్యక్షులు గుంటి రామచందర్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, ధర్మ అర్జున్, బైరి రమేష్, అధికార ప్రతినిధి డోలి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed