Nvidia: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా.. యాపిల్ ను వెనక్కి నెట్టిన ఏఐ చిప్ మేకర్

by Maddikunta Saikiran |
Nvidia: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా.. యాపిల్ ను వెనక్కి నెట్టిన ఏఐ చిప్ మేకర్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా(Nvidia) ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. కొన్ని నెలలుగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టెక్ దిగ్గజం యాపిల్‌(Apple)ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. త్వరలో ఏఐ సూపర్‌ కంప్యూర్స్ చిప్స్‌(AI Supercomputers Chips) తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్‌(Company Share) గత రెండేళ్ళలో భారీ స్థాయిలో లాభాలను ఆర్జించింది. అదే స్థాయిలో కంపెనీ షేర్‌ విలువ కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌విడియా షేర్ల విలువ 3.53 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ చిప్(AI Chip)లను తయారు చేస్తున్నందువల్లే ఇన్వెస్టర్లు(Investors) ఎన్‌విడియా స్టాక్(Nvidia Stock)లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అమెరికా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్లే ఆ సంస్థ షేర్ విలువ ఈ నెలలో 18శాతం పెరిగిందని తెలిపారు.

Advertisement

Next Story