DMK MP: కేంద్రమంత్రికి ఘాటు రిప్లయ్ ఇచ్చిన డీఎంకే ఎంపీ అబ్దుల్లా

by Shamantha N |
DMK MP: కేంద్రమంత్రికి ఘాటు రిప్లయ్ ఇచ్చిన డీఎంకే ఎంపీ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం, తమిళనాడు (Tamil Nadu) మధ్య భాషా వివాదం వేళ కేంద్రమంత్రికి ఎంపీ ఇచ్చిన రిప్లయ్ చర్చనీయంగా మారింది. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ హిందీలో రాసిన లేఖకు డీఎంకే ఎంపీ పుదుకొట్టై ఎంఎం అబ్దుల్లా (MP Pudukkottai MM Abdulla) తమిళంలో సమాధానం ఇచ్చారు. ఆ హిందీ లేఖ తనకు ఏమాత్రం అర్థం కాలేదని అబ్దుల్లా మంత్రికి బదులిచ్చారు. రైళ్లలో ఆహారనాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రి హిందీలో బదులిచ్చారు. ఈవిషయమై రెండు వేర్వేరు భాషల్లో ఒకరికొకరు రాసుకున్న లేఖలను ఎంపీ అబ్దుల్లా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘రైల్వేశాఖ సహాయమంత్రి నుంచి వచ్చే లేఖ ఎప్పుడూ హిందీలోనే ఉంటుంది. ఆయన కార్యాలయంలో విధుల్లో ఉన్న అధికారులకు ఫోన్‌ చేసి.. నాకు హిందీ రాదని, లెటర్ ఇంగ్లీషులో పంపాలని కోరాను. కానీ హిందీలోనే రిప్లయ్ వచ్చింది. అయితే నేను మాత్రం ఆయన అర్థం చేసుకునేలానే జవాబు పంపాను’’ అని సోషల్ మీడియాలో అబ్దుల్లా తెలిపారు. అలాగే సమాధానం ఇప్పటినుంచైనా ఇంగ్లీషులో ఉండేలా ఎంపీ అబ్దుల్లా చూడాలని కోరారు.

అమిత్ షా ఏమన్నారంటే?

గతంలో హిందీ భాష గురించి అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘హిందీ-గుజరాతీ, హిందీ-తమిళం, హిందీ-మరాఠీల మధ్య పోటీ ఉందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారున. దేశంలోని ఏ భాషకూ హిందీ పోటీ కాదు. దేశంలోని భాషలన్నింటికీ ఇది తెలిసిన భాష. హిందీ అభివృద్ధి చెందినప్పుడే దేశంలోని ప్రాంతీయ భాషలన్నీ అర్థమవుతాయి. భాషలన్నీ పరస్పరం సహకరించుకుంటే తప్ప మన సొంత భాషలో దేశం నడవాలనే స్వప్నాన్ని సాకారం చేసుకోలేమన్నారు’’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed