- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం గర్వించే రీతిలో వజ్రోత్సవాల నిర్వహణ: ఎర్రబెల్లి
దిశ, జనగామ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశం గర్వించే రీతిలో వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
తొలుత మంత్రి జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య, డీసీపీ సీతారాములతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 8-22వ తేదీ వరకు పక్షం రోజులపాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపోతే జిల్లాలో రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ విత్తనాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో ముందుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు బంధుకు రూ. 60.85 కోట్ల, రైతుబీమాకు రూ.98.85 కోట్లు, సబ్సిడీ విత్తనాల కోసం రూ. 66 లక్షలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో 965 చెరువుల కింద 51 వేల ఎకరాల రూపంలో వచ్చిందని అన్నారు.
ఉపాధి హామీలో గతంలో కంటే పదిహేను వేల మంది కూలీలకు జాబ్ కార్డులిచ్చామని, అదేవిధంగా బ్యాంకు లింకేజీ కింద 3775 స్వయం సహాయక సంఘాలకు రూ. 109. 22 కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. స్త్రీనిధి కింద రూ.10 కోట్లు, పశు సంవర్ధక శాఖ కింద అయిదు వేల ఏడు వందల డెబ్బై అయిదు గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 122 పాడి గేదెలను, 214 పాడి పశువులకు బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఉద్యానవనం, మత్స్యశాఖ, సహకార శాఖ, దళిత బంధు వంటి పథకాలకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి వాటి కోసం 4,113 మందిని గుర్తించి వారికి రూ. 100,116 చొప్పున అందజేసినట్లు వివరించారు.
ఎక్సైజ్ శాఖ పరంగా గుడుంబాను అరికట్టడంలో జిల్లా విజయవంతమైందని వివరించారు. అదేవిధంగా అటవీ శాఖలో ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా వన సంపదను పెంపొందించేందుకు కూడా పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయానికొస్తే జిల్లాలో 4239 గృహాలు లక్ష్యంగా ఎంచుకోగా, 3881 నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 134 కిలోమీటర్ల పొడవునా చేనేత 13 బీటీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం రూ.98.54 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
అదేవిధంగా డీఎంఎఫ్టీ, సీఆర్ఆర్ ద్వారా 89 రోడ్లకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, కొన్ని పురోగతిలో ఉన్నాయని వివరించారు. జౌళి, స్త్రీ, శిశుసంక్షేమ, మహిళాభివృద్ధి, దివ్యాంగులు వంటి వారి కోసం కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాల ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే నూతన పింఛన్లను డ్వాక్రా మహిళల రుణాలను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్. రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జిల్లా జడ్జి శైలజా, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీసీపీ సీతారాం, ఆర్డీవో మధుమోహన్, ఏసీపీలు జీ.కృష్ణ, రఘుచందర్, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ సుగుణాకర్రాజు, సీఐలు ఎలబోయిన శ్రీనివాస్, వినయ్ కుమార్ పలు విభాగాలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.