వరంగల్ ఎంపీగా నేనే గెలుస్తా : బాబు మోహన్

by Aamani |   ( Updated:2024-04-01 15:32:33.0  )
వరంగల్ ఎంపీగా నేనే గెలుస్తా : బాబు మోహన్
X

దిశ, వరంగల్ : ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్ వరంగల్ తూర్పు నియోజకవర్గం పర్యటనలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా కూడా నేను కొనసాగుతున్న’ అని అన్నారు. బాబు మోహన్ పుట్టింది , పెరిగింది తన బాల్యమంతా వరంగల్ తోనే అనుబంధం ఉందన్నారు. బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నానని , ప్రజాశాంతి పార్టీ నుండే పోటీ చేస్తానన్నారు.

పార్టీ మారుతున్నానని అలాంటి వదంతులు పుట్టించకండి చీప్ పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్న అని అన్నారు. 25 సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నాను ఎక్కడ అబద్ధం ఆడ లేదన్నారు. బీజేపీకి వెట్టి చాకిరి చేశాను, ఎంతోమందికి సభలు నిర్వహించానన్నారు. ఫేర్ బాబు మోహన్ అనే పేరు ఉందన్నారు.పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్, విద్య కేఏ పాల్ అందిస్తున్నారన్నారు.

Advertisement

Next Story