భూకబ్జాలు, రౌడీయిజం లాంటివి నాకు తెలియదు : ఎర్రబెల్లి

by Aamani |   ( Updated:2023-11-22 15:05:36.0  )
భూకబ్జాలు, రౌడీయిజం లాంటివి నాకు తెలియదు :  ఎర్రబెల్లి
X

దిశ,తొర్రూరు : ప్రముఖ వ్యాపారవేత్త కుందూరు రామకృష్ణారెడ్డి గారి షష్టిపూర్తి సందర్భంగా తొర్రూరు పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కుందూరు వెంకట వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ...రెడ్డి సోదరులు కష్టసుఖాల్లో నేనిప్పుడు వారు వెన్నంటే ఉన్నారని పాలకుర్తి నియోజకవర్గంలోని 90% రెడ్డి ప్రజలు నాకు తెలిసిన వారే నేనెప్పుడూ వారితో ఆత్మీయ సంబంధాలను కలిగి ఉంటాను అని అన్నారు .చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన పాలకుర్తి నియోజకవర్గంలో దేవాలయాలను కాంగ్రెస్ ఎప్పుడు పట్టించుకున్నది లేదు.కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన హయాంలోనే సన్నూర్ వెంకటేశ్వర స్వామి, వలిమిడి దేవాలయం, సోమేశ్వర స్వామి టెంపుల్ ఇంకా నియోజకవర్గం లోని చాలా దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు... అలాగే తనపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని భూకబ్జాలు రౌడీయిజం లాంటివి తనకు అసలే తెలియని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ..రెడ్డి సామాజిక వర్గం లో ఎక్కువ శాతం వ్యవసాయదారులే, రైతే రాజులు చేయాలన్నది కేసీఆర్ గారి లక్ష్యమని..అందుకే రైతుబంధుని ఎకరాకు 10,000 నుంచి 16 వేలకు, వడ్లు కూడా 500 నష్టంతో అయినా సరే రెండు వేల మద్దతు ధర ఇచ్చుకుంటున్నామని ఆయన తెలిపారు.అభివృద్ధిలోనూ,సంక్షేమంలోనూ అన్ని రకాలుగా,అన్ని వర్గాలకు న్యాయం చేసే మన టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని మనమందరం కూడా ఓటు వేసి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా హాజరైన వారందరికీ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారిలో కుందూరు కరుణాకర్ రెడ్డి, గూడూరు నరసింహారెడ్డి, కే.చిత్తరంజన్ రెడ్డి,మరియు కిషోర్ రెడ్డి లు ఉన్నారు.

Advertisement

Next Story