- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వదలని వాన..డేంజర్ జోన్‌లోనే వరంగల్ కాలనీలు
బల్దియా ఆధ్వర్యం లో ముందస్తు గా 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక కేంద్రంలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని, భవిష్యత్‌లో నగరం ముంపు బారిన పడకుండా చర్యలు చేపడుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలు వెచ్చించడంతో ఎన్నో ప్రాంతాలు అభివృద్ది చెందాయని తెలిపారు. కీర్తి బార్ ఏరియా, పెరుక వాడ,జన్మభూమి జంక్షన్,చెన్నా రెడ్డి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల తో మాట్లాడారు.
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాను వరుణుడు వదలడం లేదు. ఆరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో ముఖ్యంగా వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల కాలనీల జనాలు వణికిపోతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులు కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా చెరువుల ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట పూర్తిగా నీటమునగడం, కొట్టుకుపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పత్తి పంట నీటిలో నాలుగు రోజులుగా నానుతుండటంతో మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాన..వరద..!
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 3గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 18.4, మహబూబాబాద్ 39.0, వరంగల్‌లో 27.2, హన్మకొండలో 19.1, జనగామలో 32.5 ములుగు జిల్లాలో 59.3మి.మీ.వర్షపాతం నమోదైంది. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీలో బుధవారం మధ్యాహ్నం 94.80 నీటిమట్టం ఉండగా, 5,18,710 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అలాగే బ్యారేజీ 75గేట్లను తెరిచి 5,18,710 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. అలాగే మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలో నీటి మట్టం 108.27గా ఉంది. 6.33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉంది. గోదావరి, మరియు ఇతర మార్గాల ద్వారా 66168 క్యూసెక్కులు, మానేరు ఉపనది నుంచి 28043 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీలోకి చేరుతోంది. బ్యారేజీలోకి మొత్తం 94211 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో ఉండగా, 40 గేట్లను ఎత్తి 128211 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. కాళేశ్వరం పుష్కర్‌ఘాట్ వద్ద 10.5మీటర్ల ఎత్తుతో గోదావరి ప్రవహిస్తోంది.ములుగు జిల్లా సమ్మక్క సాగర్(తుపాకుల గూడెం) బ్యారేజీలో 81.4 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. 7,54,470 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకున్న 59 గేట్లను ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్లుగానే 7,54,470 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు.
నీటిలోనే నగరం..
వరంగల్ నగరంలో అనేక కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ముంపు కాలనీల్లో మేయర్ గుండు సుధారాణి కమిషనర్ బాషాతో కలిసి పర్యటించారు. బల్దియా ఆధ్వర్యం లో ముందస్తు గా 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక కేంద్రంలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని, భవిష్యత్‌లో నగరం ముంపు బారిన పడకుండా చర్యలు చేపడుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలు వెచ్చించడంతో ఎన్నో ప్రాంతాలు అభివృద్ది చెందాయని తెలిపారు. కీర్తి బార్ ఏరియా, పెరుక వాడ,జన్మభూమి జంక్షన్,చెన్నా రెడ్డి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల తో మాట్లాడారు.
Read More: భద్రాచలంలో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. లోతట్టు ప్రాంతాలు జలమయం