Mulugu Collector : రుణమాఫీఫై ఫిర్యాదుల పరిష్కారానికి 9 మండలల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

by Aamani |
Mulugu Collector : రుణమాఫీఫై ఫిర్యాదుల పరిష్కారానికి  9 మండలల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
X

దిశ,ములుగు ప్రతినిధి: మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కిందరూ. లక్షన్నర వరకు రుణాలు ఉన్న 6 లక్షల 40 వేల మంది రైతులకు సంబంధించి 6 వేల 190 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందజేశారు.

రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెండు విడుదల లో కలిపి మన జిల్లాలో మొత్తం 19 వేల 644 మంది రైతులకు 137 కోట్ల రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగిన 12 వేల 906 రైతులలో దాదాపు 99 % మేర రుణాలు ఖాతాల్లో జామచేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 కోట్లను రెన్యువల్ చేసి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందించామని, రెండో విడత లక్షన్నర రుణమాఫీ కింద మన జిల్లాలో ఉన్న 6738 రైతులకు 67 కోట్లపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, వీటిని సైతం వచ్చే వారం రోజులలో రైతులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని, రైతుల రుణాలు రెన్యువల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందేలా బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలోని 9 మండలాల రైతుల సౌకర్యార్థం రుణమాఫీ ఫై ఫిర్యాదుల పరిష్కారానికి మండలల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల ల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ను సంప్రదించి సమస్యలు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్, డి సి ఓ సర్దార్ సింగ్, వ్యవసాయ శాఖ అధికారులు, పిఎస్ సీఎస్ సొసైటీ ఛైర్మెన్లు, సి ఈ ఓ లు, బ్యాంక్ బ్రాంచి మేనేజర్లు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, రైతులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed