- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రావిణ్య
దిశ, రాయపర్తి: రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రావిణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర అందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ధాన్యాన్ని ఆరపోసుకొని 16% తేమ కలిగిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ గారే నరసయ్య, ఎంపీడీవో కిషన్ నాయకులు పూస మధు, మండల కో ఆప్షన్ అషారఫ్ ఎంపీటీసీ అయిత రామ్ చందర్, ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు