- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Governor Jishnu Dev Verma : రామప్ప శిల్ప సంపద రమణీయం
దిశ,ములుగు ప్రతినిధి: రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని, దేవాలయ శిల్ప సంపద రమణీయంగా ఆకర్షణీయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.మంగళవారం ములుగు జిల్లా పర్యటన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్,ఎస్పీ శబరిష్ లతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు.మొదటగా రాష్ట్ర గవర్నర్ ఆలయ ప్రాంగణం లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.దేవాలయ వేద పండితులు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు సంప్రదాయాల వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆలయ మండపంలో గవర్నర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.
అనంతరం ప్రొఫెసర్ పాండురంగారావు రామప్ప దేవాలయం ప్రత్యేక విశిష్టత ఐనా నీటిపై తేలియాడే ఇటుక ను ప్రత్యేకంగా గవర్నర్ కు వివరించారు. ఆలయ చరిత్ర , శిల్పసంపద రమణీయత ఆలయ గైడ్ కూలంకషంగా గవర్నర్ కు వివరించారు.అనంతరం రాష్ట్ర గవర్నర్ మీడియా తో మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం కట్టడం , చరిత్ర , శిల్ప సంపద, ఎంతో రమణీయంగా ఉందని దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం రామప్ప హరిత కాటేజ్ లను, సరస్సును సందర్శించారు. అక్కడ నుండి గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి చేరుకుని అక్కడ వేలాడే వంతెన నుండి లక్నవరం సరస్సు అందాలను లక్నవరం సరస్సు చుట్టుపక్కల ఉన్న ఐలాండ్ వంటి వివరాలను, సరసం విస్తీర్ణం ఆయకట్టు వివరాలను నీటిపారుదల శాఖ ఈఈ గవర్నర్ కు మ్యాప్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరునాగారం పి ఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.