- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
దిశ, తొర్రూరు: అతి వేగంతో వస్తున్న లారీ, బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన సంఘటన మంగళవారం పాలకుర్తి మండలంలో చోటుచేసుకుంది. తొర్రూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు (TS 26 T 0152) బస్సు హైదారాబాద్ నుండి జనగం, పాలకుర్తి మీదగా తొర్రూరు వరకు వెళ్లవలసి ఉంటుంది. అయితే మంగళవారం ఉదయం హైదారాబాద్ నుండి బయలుదేరిన బస్సు పాలకుర్తి మండలం వావిలాల మల్లంపల్లి మధ్యలో సబ్ స్టేషన్ మూలమలుపు దగ్గర లారీ అతి వేగంతో ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతులు తొర్రూరు మండలం వెలికట్టే టిక్య తండకు చెందిన దంపతులు జటోత్ బుజ్జి(40) జాటోత్ ఇమని, పాలకుర్తి కేంద్రానికి చెందిన నసీమ (45) ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమం కాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా..గాయపడిన వారిని పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లారీ వేగంగా వచ్చి ఢీకొంది..
జనగామ నుండి పాలకుర్తి మీదగా తొర్రూరుకు వస్తుండగా మల్లంపల్లి మార్గమధ్యలో బస్సు మూలమలుపు తిరుగుతుండగా లారీ అతివేగంతో వచ్చి బస్సును ఢీ కొంది. బస్సును డ్రైవర్ నెమ్మదిగానే నడిపిస్తున్నాడు. అదేవిధంగా మూలమలుపులో నాలుగైదు సార్లు హరన్ కూడా కొట్టాడు. అది గమనించకుండా..లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టాడు.
-ఎండి రషీద.. కండక్టర్