ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు..

by Kalyani |   ( Updated:2024-11-07 12:01:21.0  )
ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు..
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల పరిధిలోని అంకన్న గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా జేసీబీ తో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, నమ్మదగిన సమాచారంతో వెంకటాపురం రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. మండల తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య సిబ్బందితో కలిసి అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న జేసీబీని సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మి రాజయ్య మాట్లాడుతూ.. మండల పరిధిలో అక్రమంగా గ్రావెల్, ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కేసులు పెడతామని ఈ సందర్భంగా మీడియా కు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed