- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదక ద్రవ్యాల మత్తులో పడొద్దు.. విద్యార్థులకు సూచనలు చేసిన సీఐ
దిశ, నర్సంపేట : మాదక ద్రవ్యాల మత్తులో పడి బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దని నర్సంపేట టౌన్ సీఐ పులి రమేష్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ, జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ పలు సూచనలు చేశారు. ఆదిలోనే చెడు అలవాట్లకు బానిసై నిండు జీవితాన్ని ఆగం చేసుకోవద్దని హితవు పలికారు. మాదక ద్రవ్యాల వినియోగం హానికరం అన్నారు.
కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేయడంలో సహాయం చేసినా, డబ్బు ఆశతో విక్రయానికి పూనుకున్నా నేరం చేసినట్లే అన్నారు. ఈ పనులకు పాల్పడితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్ట వ్యతిరేక పనుల్లో భాగస్వాములు కావద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా సంతోషకర జీవితాన్ని గడపొచ్చన్నారు. సమాజ శ్రేయస్సు దృష్ట్యా అందరూ మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ పులి రమేష్, సిద్ధార్థ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.