'దిశ ’ ట్రెండ్ సెట్టర్.. ‘దిశ ’ ‌2025 క్యాలెండర్ ఆవిష్కరణ..

by Sumithra |
దిశ ’ ట్రెండ్ సెట్టర్.. ‘దిశ ’ ‌2025 క్యాలెండర్ ఆవిష్కరణ..
X

దిశ, పెద్దవంగర : అతి తక్కువ కాలంలోనే ‘దిశ’ దినపత్రిక ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేసిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎస్సై క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పోలీస్ స్టేషన్‌లో దిశ మహబూబాబాద్ జిల్లా 2025 క్యాలెండర్ ను స్థానిక నాయకులు, మండల దిశ విలేఖరి బాలాజీ నాయక్ తో కలిసి ఆవిష్కరించి పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ దిశ పత్రిక ఎప్పటికప్పుడు వార్తలను ఆన్ లైన్ ద్వారా పాఠకుల ముందుంచుతూ విశేష ప్రజాదరణ పొందిందన్నారు. భవిష్యత్ లో వినూత్న రీతిలో వార్తా కథనాలు రాసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed