Warangal News :వరంగల్‌లో విషాదం...

by S Gopi |   ( Updated:2022-11-25 05:58:11.0  )
Warangal News :వరంగల్‌లో విషాదం...
X

దిశ, ఎంజీఎం సెంటర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ స్వర్ణకార కుటుంబం గురువారం సాయంత్రం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని గిర్మాజిపేటకు చెందిన సధవన్, స్రవంతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు స్వర్ణకార వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో స్రవంతి, సధవన్ గుర్తుతెలియని విషం తాగి ఆత్మహత్యకు ఒడిగట్టడంతోపాటు పెద్ద కుమారుడు మల్లన్ విరాట్ చేత కూడా తాగించారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సధవన్(33), స్రవంతి (28) మృతిచెందగా, కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వరంగల్ ఏసీపీ గిరి కుమార్ కల్కోట తెలియజేశారు.



Advertisement

Next Story