- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాధికారా.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తా ..?
దిశ ఐనవోలు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్ మండిపడ్డారు. కమిషనర్ వ్యవహార శైలి రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వ్యవహరించడం సరికాదని జక్కీ శ్రీకాంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 'హత్ సే హత్ జూడో యాత్ర' లో భాగంగా నిన్న వర్ధన్నపేట మండలంలో జరిగిన కార్నల్ మీటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జీర్ణించుకోలేక ఫ్లెక్సీలు పీకేస్తాం అనడం.
మా బీఆర్ఎస్ నాయకులు కూడా కడుతున్నారు, నేను బీఆర్ఎస్ కార్యకర్తనే అని అనడం ఆయన వ్యవహార శైలి.. అధికారిలా కాకుండా కార్యకర్తల వ్యవహరించడం పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కమిషనర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కప్పి పుచ్చడం కమిషనర్‌ను వెనుకేసుకోవడం రావడం పట్ల పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఉన్న కమిషన్ల పర్సంటేజీ వివరాలను కూడా బయటికి తీసుకొస్తామని అన్నారు.