- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీ కాళ్లమీద పడ్డ విషయం మర్చిపోయాయా?
దిశ, గూడూరు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి తీవ్రంగా ఖండించారు. సోమవారం గూడూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు ఎంపీ మాలోత్ కవితకు, టీఆర్ఎస్ పార్టీకి లేదని మండిపడ్డారు. రోజుకో పార్టీ మారే మీరు రేవంత్ రెడ్డిని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీటు కోసం మీ తండ్రి రెడ్యా నాయక్ సోనియా గాంధీ కాళ్లమీద పడిన విషయం మర్చిపోయారా? అని అన్నారు. నా కూతురు చదువుకున్నదని, గిరిజన బిడ్డ అని సోనియా గాంధీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, గెలిచి ప్రజలకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం టీఆర్ఎస్‌లో చేరి, కాంగ్రెస్ పార్టీని విమర్షించే హక్కు మీకు లేదని అన్నారు. గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని ఎంపీ కవితను హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనవత్ రాధా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్ పాషా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కంకంటి ఉప్పలయ్య, శివరాత్రి సంపత్, మండల సీనియర్ నాయకులు రసూల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.