- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగునీటి కోసం ప్రజాసంఘాల పోరుబాట.. ఆదిలాబాద్ టు ఖమ్మం పాదయాత్ర
దిశ, కాటారం : గోదావరి పరివాహక ప్రాంతాలలో సాగు నీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించిన ఒక్క ఎకరానికి సాగునీరు పారడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కాటారం ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా దక్షిణ తెలంగాణ రాయలసీమ ఇతర ప్రాంతాలకు ఇక్కడి నీళ్లను తరలిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడు భూములకు సాగునీరు అందించాలని సంకల్పం. ఈ ప్రాంత రాజకీయ నాయకులకు లేకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని, గోదావరి పరిపాక ప్రాంతాలలో ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో త్వరలోనే ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతాలకు సాగునీరు అందించేంతవరకు ఈ పోరాటము ఆగదని ఈ ప్రాంతానికి సాగునీరు అందించడానికి తమ ప్రాణాలైనా అర్పిస్తామని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఈ ప్రాంత ప్రజలను కేవలం ఓటరుగానే చూస్తున్నారన్నారు. సాగునీరు అందించడానికి ఈ ప్రాంత ప్రజాసంఘ నాయకులు సిద్ధమవుతున్నారని, గిరిజన ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, మాలభేరి రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్, మహదేపూర్ మాజీ ఎంపీపీ గురుసింగ బాపు, నేతకాని మహర్ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దుర్గం శంకర్ నాయకపోడు, సేవా సంఘం జిల్లా నాయకుడు దయ్యం పోచయ్యలు తెలిపారు.