Disha Effect: రావిరాలలో కలెక్టర్ పర్యటన...

by Kalyani |
Disha Effect: రావిరాలలో కలెక్టర్ పర్యటన...
X

దిశ, నెల్లికుదురు : వరద ప్రభావంతో దెబ్బతిన్న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం సందర్శించి పర్యటించారు. రావిరాల విలవిల కథనం దిశ దినపత్రిక ప్రచురించడంతో కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. కూలిన ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువుగట్టుకు సంబంధించి మత్తడి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెగిన చెరువు కట్టలను యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరించాలని, పాడైన విద్యుత్ లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలని, వరదమూలంగా ఏర్పడిన పారిశుధ్య సమస్యను లేకుండా నిరంతరం కనిపెట్టుకొని శానిటేషన్ చెయ్యాలని, రావిరాల కుదుటపడేంతవరకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి గృహాలు, పంటలు పూర్తిగా, పాక్షికంగా నష్టపోయిన బాధితులను వివరాలు సేకరించి నివేదిక పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు రెవెన్యూ అధికారి నరసింహారావు, మండల ప్రత్యేక అధికారి మరియన్న, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో బాలరాజు, వైద్యాధికారి నందన, కార్యదర్శి అరుణ, గ్రామ శాఖకు సంబంధించిన వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed