వర్ధన్నపేట మున్సిపాలిటీలో రచ్చ రచ్చ..

by Aamani |
వర్ధన్నపేట మున్సిపాలిటీలో రచ్చ రచ్చ..
X

దిశ,వర్ధన్నపేట: బిల్లులు, సమస్యల పరిష్కారం అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య రగడ రాజే సింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆఫీసులో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ విషయం చర్చిస్తుండగానే బిల్లుల విషయంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య గొడవ చెలరేగినట్లు సమాచారం.

ఇద్దరు సభ్యులు పరస్పరం చెప్పులు చూపించుకునే స్థాయి వరకు గొడవ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కు, మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి మధ్య బిల్లుల విషయంలో గొడవ చెలరేగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ భ్రష్టు పట్టడానికి నువ్వే కారణమంటూ సదరు కంప్యూటర్ ఆపరేటర్ పై కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed