కేంద్రం దిగుమతులను నిలిపివేసి పత్తి రైతులను ఆదుకోవాలి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Kalyani |
కేంద్రం దిగుమతులను నిలిపివేసి పత్తి రైతులను ఆదుకోవాలి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం: కేంద్రం విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు. దేశంలో అధిక సంఖ్యలో రైతులు పత్తి పండించగా నిలువలు పేరుకుపోయాయని వెంటనే ఇతర దేశాల నుండి పత్తి దిగుమతులను నిలిపివేసి రైతులకు మేలు చేయాలని శ్రీధర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం లో కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాన్ని, మీనాక్షి కాటన్ ఆగ్రో టెక్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. ఎంతో సమకూర్చి పత్తి పండించిన రైతులకు సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర రూ. 7,520 కల్పించాలని రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి అన్నారు. హస్తంలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఎక్కడ ధాన్యం కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రైతులకు కలగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మార్కెటింగ్ శాఖ, ఈ కాటన్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed