- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వాగులు, చెరువులపై జాగ్రత్తలు తీసుకోవాలిః కలెక్టర్అద్వైత్ కుమార్ సింగ్
దిశ, మహబూబాబాద్ టౌన్ః భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో చెరువులు, వాగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీనీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్స్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 51 వరద ప్రభావిత సమస్యత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ చోట్లు , స్థానిక సంబంధిత సిబ్బంది గుర్తించిన ప్రదేశాలను చెరువులు, కుంటలు, వాగుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, జిల్లాలోని అధికారులు హెడ్ క్వార్టర్స్ మైంటైన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803 ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లో 24 గంటలు నాలుగు షిఫ్టులలో సిబ్బంది అందుబాటులో ఉంటారని.. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఈ నెంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ప్రతినిత్యం ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేసి భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ, నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు.