స్టాఫ్ లేరు..రేపు రండి..15 రోజులుగా ఒకే మాట‌.. అనుమానం వ్య‌క్తం చేస్తున్న ఖాతాదారులు

by Aamani |
స్టాఫ్ లేరు..రేపు రండి..15 రోజులుగా ఒకే మాట‌.. అనుమానం వ్య‌క్తం చేస్తున్న ఖాతాదారులు
X

దిశ‌,ఏటూరునాగారం : సిబ్బంది లేరు..రేపు రండి..15 రోజులుగా ఇదే మాట చెపుతూ మాట దాట‌వేస్తున్నారంటూ కెన‌రా బ్యాంక్ గోల్డ్ లోన్ ఖాతాదారులు, క్రాప్ లోన్ రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం కెన‌రా బ్యాంక్ గోల్డ్ లోన్‌, క్రాప్ లోన్ ఖాతాదారులు, రైతులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త 15 రోజులుగా కెన‌రా బ్యాంక్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నామ‌ని ఎప్పుడు వెళ్లిన‌ బ్యాంక్ సిబ్బంది అందుబాటులో లేరంటూ, రేపు రండి అనీ ప్ర‌తి రోజు అదే మాట కెన‌రా బ్యాంక్ వారు చెపుతున్నార‌ని కెన‌రా బ్యాంక్‌ గోల్డ్ లోన్ ఖాతాదారులు, క్రాప్ లోన్ ఖాతా దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోన్ లో పెట్టిన గోల్డ్ విడిపించ‌డానికి వ‌స్తే న‌గ‌దు క‌ట్టించుకోని బంగారం ఇవ్వ‌కుండా వారం రోజులుగా తిప్పుతున్నార‌ని ఖాతాదారులు వాపోతున్నారు.కాగా బుద‌వారం రోజున ఇదే క్ర‌మంలో బ్యాంక్ కు వెళ్లిన గోల్డ్ లోన్ ఖాతాదారుల‌కు, క్రాప్ లోన్ ఖాతాదారుల‌కు సిబ్బంది లేరూ రేపు రండి అనే మాట ఎదురవ‌డంతో బ్యాంక్ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు.

బంగారం ఇవ్వ‌డంలో జాప్యం..మాట దాట వేస్తున్న సిబ్బంది..

కెన‌రా బ్యాంక్ వారు గోల్డ్ లోన్ లో పెట్టిన త‌మ బంగారంకు న‌గ‌దు క‌ట్టించుకుని బంగారం తిరిగి ఇవ్వ‌డానికి సిబ్బంది లేరంటూ రేపు రండి అంటూ వారం రోజులుగా జాప్యం చేస్తున్నార‌ని గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఏటూరునాగారం మండ‌ల, రోయ్యూర్ శంక‌ర్ రాజ్ పల్లి గ్రామానికి చెందిన వ్య‌క్తి వారం రోజుల క్రితం కెనరా బ్యాంక్ లో గోల్డ్ లోన్లో ఉన్న త‌న బంగారం విడిపించుకోవడానికి వస్తే న‌గ‌దు కట్టంచుకున్నాక సిబ్బంది లేరూ రేపు వ‌చ్చి బంగారం తీసుకోండి అని తెలుపార‌ని, కాగా వారం రోజులుగా అదే మాట చెపుతుండ‌డంతో ఆగ్ర‌హం చెందిన ఖాతాదారుడు బుధవారం రోజున బ్యాంక్ ముందు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో ఇదే రోజున త‌న బంగారం త‌న‌కి ఇస్తామని బ్యాంక్ వారు తెలిప‌న‌ట్లు స‌మాచారం.

వ‌డ్డీ కట్టిన లోన్ లేదు...

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు మూడు దఫాలుగా రుణ‌మాఫీ చేసింది. అయితే రుణ మాఫీ అయిన క్రాప్ లోన్ ఖాతాదారులు మిగిలిన న‌గ‌దు వ‌డ్డీని క‌ట్టి మ‌ర‌లా లోన్ తీసుకుంటారు. అయితే ఇదే క్ర‌మంలో 15 రోజులుగా రుణ‌మాఫీ జ‌రిగిన ఖాతాదారులు తిరిగి క్రాప్ తీసుకోవాడానికి బ్యాంక్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ సిబ్బంది లేరూ అనే మాట బ్యాంక్ నుండి ఎదుర‌వుతుంద‌ని రైతులు చెబుతున్నారు. లిస్ట్‌లో రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్టుగా తెలిసిన రైతులు బ్యాంక్ కి వెళ్లి అడిగితే త‌మ రుణ‌మాఫీ జ‌ర‌గ‌లేద‌ని బ్యాంక్ నుండి స‌మాధానం వ‌స్తున్న‌ట్లు రైతులు చెబుతున్నారు.

బంగారం ఉందా..లేదా..అనుమానం వ్య‌క్తం చేస్తున్న గోల్డ్ లోన్ ఖాతాదారులు..

కెన‌రా బ్యాంక్ లో త‌మ బంగారం సుర‌క్షితంగా ఉందా అని గోల్డ్ లోన్ ఖాతాదారులు అనుమానం వ్య‌క్త ప‌రుస్తున్నారు. గ‌త కొంత కాలం క్రితం మంగ‌పేట మండ‌ల పరిదిలోని బ్యాంక్‌లో ఇదే త‌ర‌హలో గోల్డ్ లోన్ బాధితులు త‌మ బంగారం కోసం ఇబ్బందులు ఎదుర్కోన్నార‌ని, కాగా ఇప్పుడు ఏటూరునాగారం మండ‌ల ప‌రిదిలో ఇదే త‌ర‌హాలో బ్యాంక్ నుండి స‌మ‌స్య ఎదుర‌వుతుండ‌డంతో గోల్డ్ ఖాతాదారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఈ విష‌య‌మై దిశ కెన‌రా బ్యాంక్ మేనేజ‌ర్ ను సంప్రందించే ప్ర‌య‌త్నం చేయ‌గా బ్యాంక్ మేనేజ‌ర్ అందుబాటులోకి రాలేదు. ఇప్ప‌డికైన బ్యాంక్ శాఖ ఉన్నతాదికారులు స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు ఖాతాదారులు, గోల్డ్‌లోన్ ఖాతాదారులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed