- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూడూరులో బీఆర్ఎస్ ధర్నా
దిశ, గూడూరు: తెలంగాణ రాష్ట్రంలో రైతు కల్లాల నిర్మాణానికి వినియోగించిన రూ. 151 కోట్లను తిరిగి చెల్లించాలంటున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కల్లాలకు వినియోగించిన నిధులను తిరిగి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సిగ్గు చేటు అని అన్నారు. అలాగే రైతులు పండించిన వడ్లను కొనకపోవడం, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఇలా రైతుల ప్రతి పనికి అడ్డుపడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు ఖండించారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఒకలా తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం మరోలా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులను మోసం చేస్తూ ఇచ్చిన నిధులను వెనక్కి అడగడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మరియు భారత దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వనికి తగిన బుద్ది చెబుతారని అన్నారు.
దేశంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనతోనే ముందుకు వెళ్లి విజయం సాధించి రైతే రాజు దేశానికి వెన్నెముక అని నిరూపిస్తారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు భరత్ కుమార్ రెడ్డి, ఖాసిం, లింగా రెడ్డి, ఎంపీపీ సుజాత మోతిలాల్, వేం వెంకట కృష్ణారెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, నూకల సురేందర్, జిల్లా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.