- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓరుగల్లు నుంచే నిరుద్యోగ మార్చ్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై బీజేపీ పోరును ఉధృతం చేయనుంది. ఓరుగల్లు నుంచి నిరుద్యోగ మార్చ్ చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 15న కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలవారీగా చేపట్టాలని డిసైడ్ అయింది. తెలంగాణ రెండో రాజధానిగా పిలుచుకునే ఓరుగల్లులోని కాకతీయ యూనివర్సిటీ రాష్ట్ర ఉద్యమానికి ఉస్మానియా వర్సిటీ తర్వాత ఊతమిచ్చింది. అందుకే సెంటిమెంట్ గా కాషాయదళం ఓరుగల్లును ఎంచుకుంది. ఇప్పటికే అక్కడి విద్యార్థి సంఘాలు నేతలు, విద్యార్థులు, నిరుద్యోగులతో బీజేపీ శ్రేణులు భేటీ అయ్యాయి. మార్చ్ ను సక్సెస్ చేయడంపై నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ దీక్ష తర్వాత ఇతర జిల్లాల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు కానున్నాయి.
మూడు డిమాండ్లతో పోరు
పేపర్ల లీక్ పై బీజేపీ ప్రధానంగా 3 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలని ముందు నుంచే డిమాండ్ చేస్తున్నది. మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని పార్టీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. వీటినే ప్రధాన ఎజెండాగా చేసుకుని అన్ని వర్సిటీల విద్యార్థులు, కోచింగ్ సెంటర్లలో పర్యటించి నిరుద్యోగులను చైతన్యవంతుల్ని చేసేందుకు పార్టీ నేతలు రెడీ అయ్యారు. మే నెలలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ ప్రక్రియను పూర్తి చేసి మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టడం పైన దృష్టి సారించింది.
యువత పాల్గొనేలా..
బీఆర్ఎస్‌గా మారాక గులాబీ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ కూడా కోల్పోయింది. దీన్ని బీజేపీ సెంటిమెంట్ గా వాడుకోవాలని చూస్తున్నది. తెలంగాణ ఉద్యమం సమయంలో అమరులైన యువకుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో విద్యార్థుల బతుకులు బాగుపడుతాయనుకుంటే పరిస్థితి ఏమాత్రం మారలేదనే విషయాన్ని వివరించి నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేలా చైతన్యం తీసుకురానున్నారు. అయితే.. బీజేపీ నిరుద్యోగ మార్చ్ పోరు ఫలిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.