డాక్టర్ల నిర్లక్ష్యానికి పసిపాప మృతి..!

by Kalyani |   ( Updated:2023-04-26 10:29:58.0  )
డాక్టర్ల నిర్లక్ష్యానికి పసిపాప మృతి..!
X

దిశ, మల్హర్: భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి పసి పాప మృతి చెందిన విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ చేస్తారని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి వస్తే డాక్టర్లు మృతి చెందిన పసిపాపని చేతుల్లో పెట్టడంతో కడుపుకోత మిగిల్చారని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన లోక రాజబాబు, భార్య సోనీ పురిటి నొప్పులతో డెలివరీ కోసం మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యులుగా అత్యుత్సాహాన్ని నార్మల్ డెలివరీ చేస్తామంటూ కాలయాపన చేస్తూ భార్య సోనిని అపస్మారక స్థితిలోకి తీసుకుపోయారని భర్త రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న ఆపరేషన్ చేసి పిండాన్ని బయటికి తీయాలని తల్లికి బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మీ నుంచి హామీ పత్రం కావాలని సంతకం చేయించుకొని సాయంత్రం ఆరున్నర గంటలకు ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం వల్ల పసిపాప హార్ట్ బీట్ కొట్టుకోవడం లేదని వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి వైద్యులు ఈ పసిపాపకు ప్రమాదం పొంచి ఉంది ఎంత ప్రయత్నించినా కష్టమే అయిన ప్రయత్నం చేస్తామని ఆక్సిజన్ పెట్టి అరగంటకే ప్రయత్నం ఫలించలేదని మీ పాప చనిపోయిందంటూ పాప డెడ్ బాడీని చేతిలో పెట్టడంతో తండ్రి రాజబాబు రోదనలు అందరిని కలచి వేసింది.

వంద పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మా పాప చనిపోయిందని జిల్లా కలెక్టర్ స్పందించి 100 పడకల ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీటితో వేడుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా 100 పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యo పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed