- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండవ విడత గొర్రెల పంపిణీ పై అవగాహన..
దిశ, హనుమకొండ టౌన్: గొల్ల, కురుమలకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న రెండవ విడత గొర్రెల పంపిణీ విధి విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకట్ నారాయణ, ఏడీలు రవికుమార్, శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ డీడీలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో గొర్రెల పంపిణీ ఉంటుందని, దానికి లబ్ధిదారులు సన్నద్ధం కావాలని తెలిపారు. అనంతరం లబ్దిదారుల సందేహలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, చౌళ్లపెల్లి సర్పంచ్ రవి కుమార్ ఫేజ్ 2 మండల కమిటీ సభ్యులు, ఆత్మకూర్, పెద్దాపురం, పెంచికలపేట, చౌల్లపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.