ఎక్సైజ్‌ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సోమవారం వేలం పాట

by Mahesh |
ఎక్సైజ్‌ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సోమవారం వేలం పాట
X

దిశ, తొర్రూరు: అక్రమ నాటుసారా, బెల్లం సరఫరా చేసి పట్టుబడిన వాహనాలను వేలం పాట వేస్తున్నట్లు ఏఈఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ప్రవీణ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చే సోమవారం ఉదయం 11 గంటలకు తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయం నందు ఎక్సైజ్ నేరంలో పట్టుబడిన వాహనం వేలంపాట ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఏఈఎస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకటనలో తెలియజేశారు.వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్ రావు మరియు మహబూబాబాద్ డీపీఈఓ బి.కిరణ్ ఆదేశాల మేరకు తేది 08.07.2024 సోమవారం ఉదయం 11:00 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ తొర్రూరు నందు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని తెలిపారు.

ఈ వేలంపాటలో పాల్గొనదలచిన వారు వాహన ధరలో 50% జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ మహబూబాబాద్ పేరున డిడి తీయవలెనని తెలిపారు. ఈ వేలంపాటలో ఉంచబడిన వాహనాలు తొర్రూరు మండలం మరిపెడ మండలం, చిన్న వంగర మండలం, నారసింహులపేట మండలం,దంతాలపల్లి మండలకు సంబంధించిన వాహనాలు తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్లలో కలవు. కావున ఇట్టి వాహనాల వివరాలు ఎక్సైజ్ స్టేషన్ నందు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొన్న వేలంలో వచ్చిన వాహనం తీసుకోని ఎడల అతని యొక్క డిడి అమౌంట్ జప్తు చేయడం జరుగుతుందని ప్రవీణ్ తెలిపారు.

Next Story