- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలర్ట్: మామునూరు నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: వరంగల్ జిల్లా మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం 2023 -24 విద్యా సంవత్సరమునకు ఆరవ తరగతిలో ప్రవేశము పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు సోమవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రస్తుత విద్యా సంవత్సరములో ఐదవ తరగతి చదువుచున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31 తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. దరఖాస్తు చేసుకుని విద్యార్థుల వయస్సు 01- 05 - 2011 నుంచి 30 - 04 - 2013 మధ్య జన్మించి ఉండలన్నారు. దరఖాస్తు చేయు విద్యార్థులు ఐదవ తరగతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా చదువుతూ ఉండలన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు www.navodaya.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్నీ వివరాల కొరకు ఏసీజిఈ మందుల శ్రీరాములును సంప్రదించాలన్నారు.