సద్దుల బతుకమ్మ లో అపశృతి..

by Kalyani |
సద్దుల బతుకమ్మ లో అపశృతి..
X

దిశ, మంగపేట: గురువారం రాత్రి జరిగిన సద్దుల బతుకమ్మ ఆటలో అపశృతి చోటు చేసుకుంది. మండలంలోని కొత్తూరు మొట్లగూడెం మహిళలు గ్రామ సమీపంలోని బొమ్మాయిగూడెం రోడ్డు గౌరారం వాగు కాజ్ వే ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఆడడానికి వెళ్లారు. ఈ క్రమంలో బతుకమ్మలపై పెట్టిన అగర్ బత్తుల పొగతో అక్కడి చెట్లపై ఉన్న తేనెటీగలు లేచి మహిళలపై దాడికి దిగడంతో వారంతా బేంబేలెత్తిపోయి బతుకమ్మలు వదిలి గ్రామం వైపు పారిపోయారు. తేనెటీగల దాడిలో గాయపడ్డ సుమారు 10 మంది మహిళలకు ముళ్లను తీసి గిరిజనులు చెట్ల పసరు పూసి స్థానికంగా వైద్యం అందించినట్లు తెలిపారు.

Advertisement

Next Story