- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో బాలుడిపై కుక్కల దాడి..
దిశ, కరీమాబాద్: ఇటీవల హైదరాబాదులో వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడు ఘటన మరవకముందే కరీంనగర్ లో కూడా కుక్కలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే తాజాగా బుధవారం వరంగల్ కాశిబుగ్గ పోచమ్మ గుడి ప్రాంతంలో బండారి రోహిత్ అనే యూకేజీ విద్యార్థి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖంపై రక్కుతూ దాడి చేయడంతో బాలుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు విషయం తెలుపగా హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి బాలుడిని తరలించారు.
ప్రస్తుతం ఎంజీఎంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడినా, వరంగల్ బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ ఈ సంఘటనను దృష్టిలో పట్టుకొని వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.