Rehabilitation: 20 కుటుంబాలను పునరావాసానికి తరలింపు

by Aamani |
Rehabilitation: 20 కుటుంబాలను పునరావాసానికి తరలింపు
X

దిశ,మంగపేట : మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీలో శిథిలావస్థలో ఉన్న 20 ఐబీ క్వార్టర్లలో నివాసమున్న సుమారు 20 కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు ఆ కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఆదివారం రాత్రి పంచాయతీ సిబ్బంది ద్వారా అందిన సమాచారం మేరకు తహసీల్దార్ బి.వీరాస్వామి, డిప్యూటీ తహసీల్దార్ జె.మల్లేశ్వరరావులతో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది శిథిలావస్థలో ఉన్న ఐబీ క్వార్టర్లను సందర్శించి అందులో నివాసముంటున్న దళిత కుటుంబాలతో మాట్లాడారు. మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏ క్షణంలోనైనా క్వార్టర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయా కుటుంబాలు ఖాళీ చేయించి వారిని గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబాలకు రాత్రి భోజనం వసతి ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తహసీల్దార్ వీరాస్వామి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed