- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Warangal : సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ (Warangal Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వరంగల్ ఎంపీ కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎయిర్పోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక కృషి చేసిందని, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు సీఎంకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు.