- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరంగల్ సీపీ VS బీజేపీ స్టేట్ చీఫ్.. ముదిరిన పంచాయితీ!
దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వరంగల్ సీపీ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సీపీ చేసిన దందాలు తనకన్నీ తెలుసని బండి సంజయ్ ఆరోపణలు చేస్తే.. నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అదేస్థాయిలో సీపీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేశాననే ఆక్రోశంతోనే సంజయ్ అలా మాట్లాడుతున్నారని రంగనాథ్ స్పందించారు.
ప్రత్యేక నివేదికతో ఢిల్లీకి...
అయితే టెన్త్ పేపర్ లీకేజీ అంశంలో సంజయ్ అరెస్టుపై వరంగల్ సీపీ అత్యుత్సాహం ప్రదర్శించారని బీజేపీ నేతలు సీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సీపీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వరంగల్ సీపీ రంగనాథ్ పై ప్రత్యేక నివేదిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఢిల్లీకి వెళ్లిన బండి తన వెంట ఆ నివేదికలు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. గతంలో రంగనాథ్ వివిధ జిల్లాల్లో పనిచేసిన సందర్భంలో ఆయనతో ఇబ్బంది పడిన బాధితుల వర్షన్స్‌తో సమగ్రంగా నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. రంగనాథ్‌పై ఉన్న సెటిల్మెంట్లు, అక్రమ ఆస్తుల ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు బీజేపీ వర్గీయులు చెబుతున్నారు.
పరువు నష్టం దావా?
సంబంధం లేకపోయినా అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై పరువునష్టం దావా కూడా వేస్తానని బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. పలువురు బ్యూరోక్రాట్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసి ప్రమోషన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు పొందాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్‌గా పెట్టుకున్నారని చెబుతోంది. వరంగల్ సీపీ తొలిరోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడని మాటలకు, మరో రోజు నిర్వహించిన సమావేశంలో చేసిన కామెంట్లకు ఏమాత్రం పొంతనలేదని, దీన్ని బట్టే ఇది అర్థం చేసుకోవచ్చని కమలనాథులు చెబుతున్నారు.
అలా చేయడం వల్లే సీపీ రంగనాథ్ బీజేపీ టార్గెట్‌గా మారినట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన 1996లో గ్రూప్ -1 ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యారు. డీఎస్పీగా గ్రేహౌండ్స్ లో తొలి బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. తూర్పుగోదావరి, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ వరంగల్ జిల్లాల్లో పనిచేశారు. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న సందర్భంలో డీఐజీగా పదోన్నతి పొంది, సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ సీపీగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.