గాంధీ భవన్‌లో రసాభాస.. ఆగ్రహంతో మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి పొన్నం

by GSrikanth |
గాంధీ భవన్‌లో రసాభాస.. ఆగ్రహంతో మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరి తీరు వారే అన్న చందంగా ప్రవర్తించిన నేతలు.. ఎన్నికల సమయంలో మాత్రం సమిష్టిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవు అనుకునే సమయంలో గాంధీ భవన్ వేదికగా ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ ఇన్‌చార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, పార్టీ నేత అజారుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం.

ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లడాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడంతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినవాళ్లం అవుతామని అజారుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ నాకు ఎమ్మెల్యేలంతా సమానమే అని చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీ మర్యాద పూర్వకంగా ఆహ్వానించినందుకు వెళ్లానని స్పష్టం చేశారు. అయినా గొడవ సర్దుమణగకపోవడంతో ఆగ్రహంతో మంత్రి పొన్నం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed