తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన

by Satheesh |   ( Updated:2024-05-01 10:55:38.0  )
తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రజల సంక్షేమార్గం తన నియోజకవర్గంలో వాలంటరీ వ్యవస్థను తీసుకువస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థను నల్గొండ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి, ఆ వాలంటీర్లకు ప్రతినెల రూ.5వేలు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను సమన్వయం చేసేలా మండల స్థాయిలో కూడా వాలంటీర్‌ను నియమిస్తామన్నారు.

మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఇదే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. నిరుపేదకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారులకు ఇంటికి చేర్చేలా వాలంటీర్లు పనిచేస్తారన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లందర్నీ కోఆర్డినేషన్ చేయడానికి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో, సచివాలయంలో తన చాంబర్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయునట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానన్నారు.

Advertisement

Next Story