- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికో ప్రీతిని వేధించిన సైఫ్‌ను ఎన్కౌంటర్ చేయాలి.. విశ్వహిందూ పరిషత్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతిని ఘోరంగా వేధించిన సైఫ్‌ను ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని.. అందులో భాగంగానే కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి అంశం కూడా ఉందని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు కూడా నిందితులకు వత్తాసు పలకడం శోచనీయమని విమర్శించింది. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పి బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
హోం మంత్రి మహమ్మద్ అలీకి నిందితుడు సైఫ్ బంధువు కావడంతో స్థానిక పోలీసులు బాధితురాలు విషయంలో అలసత్వం ప్రదర్శించారని తెలిపారు. అత్యంత ప్రతిభావంతురాలు అయిన ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. సైఫ్ తీవ్రంగా వేధించడంతోనే తట్టుకోలేక పోయిందని పేర్కొన్నారు. తమ కూతురుది ఆత్మహత్య యత్నం కాదని.. సైఫ్ చేసిన హత్య యత్నం అని బాధితురాలు తండ్రి చెప్పడం మనుషులను కలిచి వేస్తోందన్నారు. నిందితులను రక్షించేందుకు కోసం రంగంలోకి దిగిన కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్, డీఎంఈ రమేష్ రెడ్డిలు కూడా సైఫ్ ను వెనకేసుకు రావడం మానవత్వానికే మచ్చ అని విమర్శించారు.
అమ్మాయిల విషయంలో ఇంతటి ఘోరం జరుగుతున్న కూడా సీఎం స్పందించకపోవడం.. ట్విట్టర్ వేదికగా స్పందించే మంత్రి కేటీఆర్ నోరు మెదకపోవడం సైఫ్‌కు మద్దతు ఇవ్వడమేనని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆరోపించారు. ఆడపిల్ల వైపు చూస్తే కనుగుడ్లు పీకేస్తానన్న సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని వారు పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు కంటి తుడుపు మాటలు మాట్లాడడం మానుకోవాలని.. నిందితులను కఠినంగా శిక్షించే పని ప్రారంభించాలని సూచించారు.