- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ టికెట్ కోసం ఎదురుచూస్తున్నా: గద్దర్ కూతురు వెన్నెల
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తాను ఎదురుచూస్తున్నానని గద్దర్ కూతురు వెన్నెల ప్రకటించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నానని, ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.
కొన్ని రోజులుగా తన పేరు మీడియాలో వస్తోందని, రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది తనపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేసి విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలోనే ప్రజల కోసం కొట్లాడాలనే ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదని ఆమె గుర్తు చేశారు. కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తానని వెల్లడించారు.
‘‘మా నాన్న చివర్లో కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా. గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారు. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని గద్దర్ కోరుకునేవారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోంది కాబట్టే కాంగ్రెస్‌కి మా మద్దతు. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తాను’’ అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ భార్య విమల మాట్లాడుతూ..‘‘నా బిడ్డకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తోంది. నా బిడ్డకి టికెట్ ఇస్తే ఆమె తరపున ప్రచారం చేస్తా. నా బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు.