మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సంచలన సవాల్

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-06 06:54:44.0  )
మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామని తాను రెడీ అని దమ్ముంటే జగదీష్ రెడ్డి రాజీనామా చేసి పోటీకి రావాలని వీరేశం సవాల్ విసిరారు. కాంగ్రెస్ 420 కాదు మీరే 420 అని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. గతంలో గ్రామాలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు అసహనంతో విమర్శలు చేస్తున్నారు. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Advertisement
Next Story

Most Viewed