VC.Sajjanar : అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదే! ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక

by Ramesh N |   ( Updated:2024-11-18 11:38:26.0  )
VC.Sajjanar : అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదే! ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting) కూపంలో పడొద్దని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) హెచ్చరించారు. అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర బెట్టింగ్ వీడియో పోస్ట్ చేశారు. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్‌లైన్ బెట్టింగ్ (Betting Scam) కూపంలోకి లాగుతున్నారని వెల్లడించారు. త‌మ స్వ‌లాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. వారి ప్రాణాల‌ను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శ‌క్తులే.. అని ఆరోపించారు.

యువ‌కుల్లారా.. ఈజీగా మ‌నీ సంపాదించాల‌నే ఆశ‌తో ఇలాంటి సంఘ విద్రోహ శ‌క్తుల మాయ‌మాటల్లో ప‌డొద్దని, బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకోకండని సూచించారు. జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి షార్ట్ క‌ట్స్ ఉండ‌వన్నారు. మీ క‌ష్టాన్ని న‌మ్ముకోండి.. విజ‌యం దానంత‌ట అదే మీ ద‌రికి చేరుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed