పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత సత్తా చూపిన వ్యక్తి వాజ్ పేయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత సత్తా చూపిన వ్యక్తి వాజ్ పేయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అటల్ బిహారీ వాజ్ పేయి స్ఫూర్తితో నీతివంతమైన, అవినీతిరహిత, సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్‌లోని భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో, అనేక విద్యాసంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాజ్ పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని కొనియాడారు.

వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల జీవన స్థితిని మెరుగుపరిచేలా ఆశ్రయం కల్పించారని, సడక్ యోజనతో రహదారులు అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి వాజ్ పేయి అని కొనియాడారు. పేద ప్రజల కోసం సంక్షేమ సోమవారం అనేక కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా కులం, మతం, ప్రాంతాలు, భాషలకతీతంగా ఐక్యమత్యంతో ముందుకెళ్లి దేశాన్ని శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలని కిషన్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed