- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉత్తమ్‌కు మతి భ్రమించింది : ఎమ్మెల్యే సైదిరెడ్డి
దిశ, నేరేడుచర్ల : నియోజకవర్గం అభివృద్ధి, పార్టీ డెవలప్‌మెంట్ అపే ప్రసక్తి లేదని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపు సైది రెడ్డి స్వష్టం చేశారు. నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఎమ్మెల్యే సైదిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై స్వందించారు. ఆదివారం మేళ్లచెరువు జాతర సందర్భంగా ఎద్దుల పందెలను ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిది రాజకీయం చేస్తున్నారని అంటున్నారని.. ఎన్ని మాట్లాడిన పండుగలు, అభివృద్ధి ఇలాగే చేస్తానని తెలిపారు.
రాజకీయం చేయడానికే రాజకీయాలలోకి వచ్చానన్నారు . ఉత్తమ్ గురించి మాట్లాడవద్దనుకున్నానని నన్ను తలుచుకోనిదే ఆయనకు నిద్ర పట్టాదని ఎద్దెవా చేశారు. ఉత్తమ్‌కు మతి భ్రమించిందని ఏమి మాట్లాడుతూన్నరో ఆయనకే తెలయదన్నారు. 27 ఏళ్లలో ఉత్తమ్ చేయని అభివృద్ధిని ఈ ప్రభుత్వంలో 3 ఏళ్లలో చేసి చూపించామన్నారు. ప్రజలు ఉత్తమ్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మేళ్లచెరువు జాతర అంటేనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కొట్టప్ప కొండ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిందన్నారు.
ఇక్కడి ప్రజలకు ఈ దేవునిపై నమ్మకం ఎక్కువ అని ఈ ఆరు రోజుల జాతరలో 4,5 లక్షల భక్తులు దర్శించుకుంటారని అన్నారు. దేవునిపై నమ్మకంతో లైటింగ్ ప్రబలను ఏర్పాటు చేస్తారని ఒక్కొక్క లైటింగ్ ప్రభకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తారని తెలిపారు. అలాగే ఎద్దుల పందాలను కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. దాతల సహకారంతో ఎనిమిది కేటగిరీలకు రూ.కోటి విలువ చేసే బహుమతులు అందిస్తున్నామన్నారు .