- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునగాల ఘటనపై ఉత్తమ్ సీరియస్.. హోంమంత్రి, డీజీపీకి కంప్లైంట్
దిశ , కోదాడ టౌన్: అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రేస్ ఎంపిటిసి శ్రీనివాస రెడ్డి పై మునగాల ఎస్సై లోకేష్ అకారణంగా దాడి చేసి గాయపరచిన సంఘటనకు నిరసనగా టిపిసిసి మాజీ అధ్యక్షుడు , నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి లు ఆదివారం రోజున కోదాడ లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు . ఈ సంఘటనపై తాను రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ , సూర్యాపేట జిల్లా ఎస్పీ ల కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కొంతకాలంగా పోలీసులు అధికార పార్టీ కి తొత్తులుగా మారి కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులపై అకారణంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని దీనిపై తాము రాజీ లేని పోరాటం చేస్తామన్నారు . కార్యకర్తలకు ఎల్లప్పూడూ అండగా ఉంటామని , వారి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు . ఆదివారం కోదాడ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించటానికి ఆ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది , ఈ క్రమంలో ఉత్తమ్ కోదాడ లో చేపట్టబోయే నిరసన దీక్షతో కోదాడ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.