మాల్స్‌లోని బాత్‌రూమ్‌లు వాడుకోండి! వామ్మో.. బెంగళూరులో నీటి కొరత సిత్రాలు

by Ramesh N |
మాల్స్‌లోని బాత్‌రూమ్‌లు వాడుకోండి! వామ్మో.. బెంగళూరులో నీటి కొరత సిత్రాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో నీటి కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో నీటి కొరతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకోని వాడుతున్నారు. స్కూళ్లలో సైతం విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడినట్లు సమాచారం. జలమండలి నుంచి నీటి సరఫరా సగానికి సగం తగ్గిపోవడంతో నీటి కొరత ఏర్పడింది. దీంతో నగరంలో ప్రైవేటు నీళ్ల ట్యాంకర్‌లతో నీళ్లు తెప్పించుకుంటున్నారు. దీంతో ప్రైవేటు నీళ్ల ట్యాంకర్ యాజమాన్యం భారీగా వాసుళ్లలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఓ గేటెడ్ కమ్యూనిటీలో విచిత్ర ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెంగళూరుకి చెందిన ఫాల్కన్ సిటీలో గత కొన్ని రోజులుగా నీటి కొరత ఎక్కువ అవడంతో అపార్ట్‌మెంట్‌లో నివసించే వాళ్లను పక్కనే ఉన్న ఫోరమ్ మాల్‌లోని బాత్‌రూమ్‌లు వాడుకోవాలని సూచించినట్టుగా ఆ అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. డే టైమ్ వాటర్ ఉండటం లేదని వారు తెలిపారు. వంట చేసుకోవడం, తాగడానికి సైతం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. బెంగళూరులో అపార్ట్‌మెంట్లలో రెంట్‌కు వచ్చే వారు కేవలం వాటర్ ట్యాకర్లతో నీటిపై ఆధారపడి ఉన్న ఆపార్ట్‌మెంట్లలో రెంట్ తీసుకోవద్దని ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed