రాష్ట్రంలో అకాల వర్షాలు.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ కీలక ఆదేశాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-26 06:57:42.0  )
రాష్ట్రంలో అకాల వర్షాలు.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు.

రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని రాష్ర్టంలో ఉందన్న కేటీఆర్, రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రంగానికి విజ్ఞప్తి చేశారు.

Read More: అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీలో..: రేవంత్ రెడ్డి

Advertisement

Next Story