బండి సంజయ్‌ పాదయాత్రపై దాడి.. కిషన్ రెడ్డి సీరియస్

by GSrikanth |
బండి సంజయ్‌ పాదయాత్రపై దాడి.. కిషన్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇవాళ ఉంటాడు.. రేపు పోతాడని అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని విమర్శించారు. మునుగోడులో అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని సీరియస్ అయ్యారు. బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed