Bandi Sanjay: సింగర్ గా మారిన బండి సంజయ్.. మోడీపై సాంగ్ వైరల్

by Prasad Jukanti |
Bandi Sanjay: సింగర్ గా మారిన బండి సంజయ్.. మోడీపై సాంగ్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో తన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సింగర్ (Singer) అవతారమెత్తారు. తాజాగా ఆయన తన గాత్రానికి పని చెప్పారు. ఓ రికార్డు స్టూడియోలో మైక్ అందుకుని నరేంద్ర మోడీపై (Narendra Modi) దాదాపు పాట పాడారు. ఏడాది క్రితం రిలీజ్ అయిన 'నమో.. నమో.. నరేంద్ర మోడీ' పాటను హుషారుగా పాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ (BJP) శ్రేణులు, బండి సంజయ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. అయితే ఇది పాత వీడియో అని ఎన్నికలకు ముందు పాడారని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బండి సంజయ్ తన సింగర్ అవతారం ఎత్తడం ఇదే కొత్త కాదు. తాను కేంద్ర మంత్రి అయ్యాక సిద్దిపేట జిల్లా హున్నాబాద్ లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమలో పాల్గొన్న ఆయన తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ 'ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం..' అనే పాటను పాడి వినిపించి అందరిని ఆకట్టుకున్నారు.

Next Story

Most Viewed