- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను మార్చే ప్రయత్నం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్దిదారులకు నేరుగా ఇచ్చే ఆలోచన చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చిందని ఆరోపించారు. మీ సొంత సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా? లేదా ఒసామా బిన్ లాడెన్, దావుద్ ఇబ్రహీం పేరు పెడతారా? పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు.. అంటూ సెటైర్లు వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలకు కేంద్రం పేరు పెట్టాలా లేదా? అని ప్రశ్నించారు. నిధులు ఇచ్చేది కేంద్రం.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అంటే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. మీరు మేము కలిస్తేనే అభివృద్ధి.. పేర్ల కోసం కొట్లాడవద్దని, పేదలకు నష్టం కలిగించే ప్రయత్నం తాము చేయమని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. రేషన్ కార్డు, బియ్యం ఫ్రీగా ఇచ్చేది కేంద్రం.. నేడు ఫోటోలు మీవి పెట్టుకుంటారా? అని మండిపడ్డారు.
పేదలకు ఇండ్లు ఇచ్చే ఆలోచన లేదని, పేరు కోసం పట్టింపని చెప్పుకొచ్చారు. కేంద్రం నిధులు దొబ్బి పోవాలి.. కానీ పేర్లు మాత్రం మావి ఉండొద్దు.. అని ఫైర్ అయ్యారు. రైతు వేదిక డబ్బులు కేంద్రప్రభుత్వానివే అని చెప్పారు. జనవరి 26 సంక్షేమ పథకాలు ఇస్తామని అన్నారు.. మండలానికి ఒక గ్రామాన్ని సెలక్ట్ చేయడం ఏమిటి? ఇదేమన్నా పైలట్ ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. కేవలం ఒక్క గ్రామంలోనే రేషన్ కార్డులు, రైతు భరోసాకు అర్హులు ఉన్నారా? అని నిలదీశారు. ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన
పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని అన్నారు. పంపేటప్పుడు మంచి వ్యక్తుల పేర్లు పంపాలి.. వాళ్ళు మంచి వ్యక్తులు కాదని అనట్లేదు.. పద్మ శ్రీ అవార్డు వచ్చే స్థాయి వ్యక్తుల పేర్లు పంపాలన్నారు. గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం.. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా? అని సంచలన కామెంట్స్ చేశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్.. అని విమర్శించారు.