- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరేడ్ గ్రౌండ్‌లో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన కేంద్ర మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ నుంచి రెండోసారి బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్( Bandi Sanjay) కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగారు. అయినప్పటికీ ఆయన పిల్లలను చూస్తే మాత్రం తన హోదాను పక్కన పెట్టి కాసేపు వారితో గడుపుతారు. కేంద్ర మంత్రి అయినప్పటికి.. తాను ఎక్కడికి వెళ్లిన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారితో ఆడటం, డీజే పాటలకు స్టెప్పులేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో స్కూల్ పిల్లలతో కలిసి బండి క్రికెట్ ఆడటం కనిపించింది.
కాగా ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హాజరు అవుతుండటంతో.. పరేడ్ గ్రౌండ్స్( parade ground)లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అక్కడే క్రికెట్ ఆడుతున్న పిల్లలతో సరదాగా కాసేపు బ్యాటింగ్ చేశారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండి సంజయ్.. "చిన్న పిల్లలతో క్రికెట్ ఆడే ఆనందానికి మించినది ఏమీ లేదు" అని రాసుకొచ్చారు.